కుఅలి దెంకనల్ నుండి 72 కిమీ దూరంలో ఉంది. కుఅలి వివిధ హిందూ మత దేవుళ్లకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలను కలిగి ఉన్నది. లార్డ్ కనకేస్వర్,లార్డ్ బలున్కేస్వర్,శ్రీ బైద్యనాథ్, పస్చిమేస్వర్,కపిలేస్వర్ వంటి తదితర ఆలయాలు ఉన్నాయి. దేవాలయాలలో కొన్ని భాగాలు నాశనం అయినప్పటికీ ప్రజలు ఆ ఆలయాలలో ఉన్న దేవతల నుండి దీవెనలు కోరుకోవటానికి దేవాలయాలకు తరలి వస్తారు.
ఒడిషా యొక్క అద్భుతమైన ఆలయ నిర్మాణాలలో కొన్ని కుఅలిలో ఉన్నాయి. ఇక్కడ దేవాలయాలు ఎత్తైనవి మరియు నిర్మాణంలో పెద్దవి. పురావస్తు ఆసక్తి ఉన్న పర్యాటకులకు అధ్యయనం కోసం చాలా ఆసక్తికరమైన ప్రదేశము. సాధారణ పర్యాటకులకు కూడా పురాతన దేవాలయాలు మరియు ఆ ప్రాంతం యొక్క సహజ అందం వారిని ఆకర్షిస్తుంది. ఈ పర్యాటక స్పాట్ ను ఏడాది పొడవునా సందర్శించవచ్చు.