కర్నాటకలోని దట్టమైన అడవులు కల దుబరే ఏనుగుల గుంపులకు ప్రసిద్ధి. సున్నితమైన ఏనుగులతో పర్యాటకులు సన్నిహిత అనుభవాలను పొంది ఆనందించవచ్చు. దుబరే అటవీ సంరక్షణ కావేరి నదీ తీరంలో కూర్గ్ లో కలదు. ఎంతో కాలంనుండి ఈ ప్రదేశం ఏనుగుల శిక్షణాలయంగా చెప్పబడుతోంది.
మైసూరు మహారాజుల పాలనా కాలంలో రాజుల ఏనుగులు ఇక్కడ శిక్షణ పొందేవి. ఈ శిక్షణ పొందిన ఏనుగులను దసరా పండుగల వేడుకలలో మైసూర్ మహారాజులు పాల్గొన చేసి ఆనందించేవారు.
ఇక్కడకు వచ్చి బస చేసే వారిలో కొంతమందికి ఈ ఏనుగులకు ఆహారం ఇవ్వటం, వాటి శరీరాలను స్పర్శించటం వంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఏనుగులు లేకుంటే మన పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానిపైనా, మరియు పర్యాటకులు వారి స్వహస్తాలతో ఏనుగులకు ఆహారం అందించటం, వారి స్వంత అనుభవ ఆనందాలను వివరించటం వంటి వివిధ అంశాలపై ప్రభుత్వ అటవీ శాఖ ఏనుగుల జంగిల్ సఫారీలను నిర్వహిస్తోంది.



Click it and Unblock the Notifications