బల్లాలేశ్వర్ దేవాలయం ఎనిమిది పవిత్ర అష్టవినాయక దేవాలయాలలో ఒకటి. ఇది సారస్ గఢ్ కోట మరియు అంబానది మధ్యగా ఉంటుంది. బల్లాలేశ్వర దేవాలయం పాలి గ్రామంలో కలదు. అసలు ప్రార్ధనా స్ధలం శ్రీ ఫడ్నీస్ కాలంలో అంటే సుమారుగా 250 సంవత్సరాల క్రిందటిది. ఈ దేవాలయాల సముదాయంలో రెండు సరస్సులుంటాయి. ఈ దేవాలయం తూర్పు దిశగా ఉండి గ్రానైట్ రాతితో నిర్మించబడింది. గణపతి విగ్రహం ఒక సింహాసనంపై కూర్చొని తూర్పు దిశ చూస్తూంటుంది. విగ్రహం కళ్ళు మరియు నాభి ప్రదేశం వజ్రాలతో పొదగబడి ఉంటుంది. రిధ్ధి మరియు బుద్ధి అనే గణపతి భార్యలు (వెండితో చేయబడిన విగ్రహాలు) ఇరువురూ ఆయనకు వెనుక భాగంలో కనపడుతూంటారు.



Click it and Unblock the Notifications