కునాల్, ఫతేహాబాద్ ప్రాంతంలో ఎండిన సరస్వతి నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రిక మట్టి దిబ్బ. ఇది హర్యానా రాష్ట్రంలోని ఒక పురాతన పురావస్తు ప్రదేశం. కునాల్ లో జరిపిన తవ్వకాలలో హరప్పా, పూర్వ-హరప్ప సంస్కృతిని తెలిపే సమాచార సంపద బయల్పడింది. చరిత్రకారులు అప్పటి కాలానికి చెందిన కుండ పరికరాలు, త్రికోణాకారపు టెర్రకోట నమూనాలు, చేతివ్రాతలు, వెండి నాణేలు, ఒక కిరీటం, బంగారు, వెండి ఆభరణాలతో సహా అనేక రాచరిక వస్తువులు, విలువైన రాళ్ళతో చేసిన ఆభరణాలు, ఇంకా అనేక ఆసక్తికరమైన వస్తువులను కనుగొన్నారు.
కునాల్ లో జరిపిన పైన తెలిపిన అన్ని తవ్వకాల వలన పూర్వ-హరప్పా సంస్కృతి మూడు దశలకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్న ఒక సాక్ష్యం వెల్లడైంది. ప్రారంభంలో ప్రజలు గోతులలో నివసించి, తర్వాత మట్టి ఇటుకలతో ఇళ్ళు నిర్మించారని, చివరికి బట్టీలలో కాల్చిన ఇటుకలతో చదరపు, దీర్ఘచతురస్రకారపు ఇళ్ళను నిర్మించారని ఇది తెలియచేస్తుంది.
చరిత్రకారులు వేద సంస్కృతి, పూర్వ-హరప్పా సంస్కృతి స్వభావంలో ఒకటే అన్న ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చారు. త్రికోణాకారపు టెర్రకోట ముక్కలు ఋగ్వేదంలో సంతానోత్పత్తికి చిహ్నం. ప్రస్తుతం ఎండిన సరస్వతి వద్ద ఉన్న కునాల్ ప్రస్తావన ఋగ్వేదములో కూడా ఉంది.



Click it and Unblock the Notifications