వీర నారాయణ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. గడగ్ లో చూడవలసిన ప్రధాన దేవాలయాలలో ఇది ఒకటి. దీనిలో మహా విష్ణువు లేదా నారాయణుడి విగ్రహం ఉంటుంది. ధోవతి కట్టబడి తన నాలుగు చేతులలోను చక్రం, శంఖు, గద మరియు పద్మాలతో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు ఉంటుంది. పర్యాటకులు లక్ష్మీ మరియు గరుడ విగ్రహాలను ప్రధాన విగ్రహానికి ఇరువైపులా దర్శిస్తారు.
మతము, చరిత్రపట్ల ఆసక్తి కలవారందరకు ఈ దేవాలయం తప్పక చూడదగినది. ఈ దేవాలయం పంచ నారాయణ క్షేత్రాలలో ఒకటిగా చెపుతారు. దీనిని 1117 సంవత్సరంలో హొయసల రాజు బిట్టిదేవ నిర్మించారు.ఈ దేవాలయం కట్టించిన వెంటనే ఆ రాజు తన పేరును విష్ణువర్ధనుడుగాను తన మతం అయిన జైన మతాన్ని, వైష్ణవ మతానికి మార్పు చేసుకున్నాడు. దీనికి కారణం అప్పటి మత గురువులు శ్రీ రామానుజాచార్య ప్రభావంగా చెపుతారు.
ఈ దేవాలయం వద్ద కూర్చొని కుమార వ్యాసుడు మహాభారాతాన్ని కన్నడ భాషలో వ్రాశాడని కూడా చెపుతారు.
వీరనారాయణ దేవాలయం వివిధ రకాల శిల్పసంపద ప్రదర్శిస్తుంది. దీనిలో చాళుక్యుల, హొయసలుల, విజయనగర పాలకుల శిల్పకళా వైభవాలు గోచరిస్తాయి. దేవాలయ ప్రవేశం విజయనగర శైలిని, గరుడ స్తంభం హోయసల శిల్పాలను, అంతర్భాగ మంటపాలు, ఇతర భాగాలు, ప్రధాన గోపురం వంటివి చాళుక్యుల శిల్ప శైలిని కలిగి ఉంటాయి.



Click it and Unblock the Notifications