దయార బుగ్యల్, ఇది సముద్ర మట్టానికి 3000 మీ. ఎగువన ఉన్న పచ్చిక మైదానం. దీని ప్రక్రుతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడనుండి హిమాలయాల సుందర దృశ్యాలను చూడవొచ్చు. ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు 7 కి. మీ. దూరంలో ఉన్న రైతల్ గ్రామం నుండి ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడకు చేరుకోవొచ్చు.
ఇంకొక ట్రెక్కింగ్ మార్గం, భట్వారి నుండి10 కి. మీ. దూరంలో ఉన్న బర్సు గ్రామం గుండా ఇక్కడకు చేరుకోవొచ్చు. ఇది ప్రయాణికులు దయార బుగ్యల్ చేరుకోవడానికి 8 కి. మీ. దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణ ప్రాంతం. పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడకు చేరుకునే మార్గమధ్యంలో శేషనాగ్ ఆలయాన్ని చూడవొచ్చు. ఈ గడ్డి మైదానంలో 28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల అనేక స్కై పల్లాలు ఉన్నాయి.
ఇక్కడ శీతాకాలంలో నోర్డిక్ మరియు ఆల్పైన్ స్కైయింగ్ ఆనందంగా అనుభూతిని పొందవొచ్చు. ఇక్కడకు వొచ్చిన స్కఎర్స్ భట్వారిలో ఉన్న గ్రామకుటీరాలలో ఉండవొచ్చు.