ఆల్ పత్తర్ లేక్ గుల్మార్గ్ కు 13కి. మీ. ల దూరం లో,4511 మీటర్లపోడవు కల అఫార్వాట్ శిఖరం మొదటి భాగంలో కలదు. ఈ సరస్సు సంవత్సరంలో జూన్ మధ్య వరకు గడ్డ కట్టి వుంటుంది. వేసవి లోమంచు కరిగి,మంచు ముక్కాల తో నీరు ప్రవహిస్తూ ఎంతో అందంగా వుంటుంది. త్రిభుజా కారంలో వుండే ఈ సరస్సు, మంచు తో కప్పబడిన పర్వత శ్రేణులు, ఎంతో సుందరంగా వుంటాయి. పర్యాటకులు గుల్మార్గ్ నుండి ఆల్ పత్తర్ లేక్ కు ఒక రోజు ప్రయాణంలో అందాలను చూస్తూ చేరవచ్చు. పోనీ ల పైకూడా చేరవచ్చు. హార్స్ రైడింగ్ ఆసక్తి కలవారు ఒక రోజులో వెళ్లి రావచ్చు. కొండలను ఎక్కటం లొ ఆసక్తి కలవారు అఫార్వాట్ శిఖరాన్ని అధిరోహించి కిందకు దిగవచ్చు.