మాగాం ప్రదేశం గుల్మార్గ్ కు 18 కి. మీ. ల దూరం లో కలదు. ఇది బుద్గాం జిల్లలో కలదు. ఇక్కడకు శ్రీనగర్, గుల్మార్గ్ రోడ్ ద్వారా చేరవచ్చు. సముద్ర మట్టానికి 1569 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రాంతం లో ఇది ఒక పెద్ద మార్కెట్ గా చెపుతారు. ఇక్కడ షియా ముస్లిం జనాభా ఎక్కువ. సుమారు 60 శాతం వుంటుంది. 1985 లో ఇక్కడ స్థాపించిన ఇదర అబుల్ ఫజాల్ అబ్బాస్ ఇస్లామిక్ లైబ్రరీలో ఎన్నో ఇస్లామిక్ గ్రంధాలు, సి డీ లు, ఆడియో కేసెట్లు, కలవు. జమ్మూ కాశ్మీర్ లో ఈ లైబ్రరీ అతి పెద్ద ఇస్లామిక్ ప్రైవేటు లైబ్రరీ. ఈ లైబ్రరీ అనాధలకు, పేదవారికి విరాళాలు సేకరిస్తుంది.
మాగం పట్టణానికి 3 కి. మీ. ల దూరం లో మాజోం రైల్వే స్టేషన్ కలదు. శ్రీనగర్ నుండి గుల్మార్గ్ వెళ్ళే రోడ్ లో నాలుగు వరుసల రహదారి లో కలదు.



Click it and Unblock the Notifications