చంద్రమౌళీశ్వర దేవాలయం 15వ శతాబ్దికి చెందిన హిందువుల పవిత్ర స్ధలం. హంపిలో ప్రధాన ఆకర్షణ. హంపి నడిబొడ్డున విఠల్ దేవాలయానికి అందుబాటులో కలదు. చంద్రమౌళీశ్వర దేవాలయం చూసే వారికి హంపి గుండా ప్రవహించే రెండు నదులు చూసే అవకాశం దొరుకుతుంది.
పట్టణంలో కల పవిత్ర పర్వతానికి కూడా వీరు వెళ్ళవచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంరక్షణలో భాగంగా దీనిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో శిల్పసంపదకలిగి కనుమరుగవుతున్న దేవాలయాలలో ఒకటిగా దీనిని యునెస్కో గుర్తించింది.



Click it and Unblock the Notifications