కింగ్స్ బేలన్స్ లేదా తులా భార, తులా పురుషదాన విజయవిఠల దేవాలయానికి సమీపంలో కలదు. స్ధానిక పాలకులు తమ బరువును ఇక్కడ వరి, బంగారం, వెండి, రత్నాలతో తూచుకొనే వారు కనుక ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. వీరు ఈ తులా భారాన్ని సూర్య లేదా చంద్ర గ్రహణాలలో చేసేవారు. చేసి వాటిని పూజారులకు దానం చేసేవారు. రెండు 15 అడుగుల ఎత్తుకల గ్రానైట్ స్తంభాలకు 12 అడుగుల బీమ్ కట్టబడి ఉంటుంది. దీనికి గల త్రాసులతో తమ బరువులువిలువైన వస్తువులతో తూచుకొని వాటిని దానం చేసేవారు. ఇక్కడే కొన్ని క్రిష్ణదేవ రాయ మరియు ఆయనకుగల ఇద్దరు రాణుల శిల్పాలు కనపడతాయి.



Click it and Unblock the Notifications