ఇది మహిళల సంరక్షణ కోసం నిర్మించబడింది. వారికి మాత్రమే ప్రవేశం కలది. దీనిలో నాలుగు ప్రధాన నిర్మాణాలుంటాయి. క్వీన్స్ ప్యాలెస్, రెండు భవనాలు మరియు ప్రసిద్ధి గాంచిన లోటస్ ప్యాలెస్. పురాతన కాలంలో ఇది రాణులకు వేసవి విడిదిగా ఉండేది. దీనికి అనేక ద్వారాలు కలవు. క్వీన్స్ ప్యాలెస్ సుమారు 46 X 29 మీటర్ల సైజు కలిగి కలప మరియు ఇతర వస్తువులతో నిర్మించబడింది.
చరిత్రకారుల మేరకు, జెనానా ఎన్ క్లోజర్ మహిళలకు మాత్రమే. ఈ ప్రదేశానికి కొజ్జాలను కాపలా పెట్టేవారు. రెండు భవనాలు వాచ్ టవర్లుగా పనిచేసేవి. ఇక్కడినుండి రాణులు వారి రాజ స్నేహితులు బయటి అంశాలు చూసేవారు. లోటస్ ప్యాలెస్ లో రాణులు సమావేశాలయ్యేవారు. దీనిని దర్శించే పర్యాటకులు, ఏనుగుల నివాసాలను కూడా ఈ ప్రదేశం వెనుక చూడవచ్చు.



Click it and Unblock the Notifications