తావా డాం ను తావా మరియు దేన్వా నదులు కలిసే చోట నిర్మించారు. ఈ డాం చాలా పెద్దది. దీనిని 1958 లో మొదలు పెట్టి 1978లో పూర్తి చేసారు. ఈ డాం హోషంగాబాద్, హర్డా జిల్లాలో వేలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. తావా డాం పరిసరాలు సహజ ప్రకృతి అందాలతో ఆకర్షిస్తాయి. ఈ ప్రాంత పచ్చదనం, డాం నీరు దీనిని ఒక పర్యాటక ప్రదేశంగా చేసాయి.
తావా డాం కు ఇటార్సి లేదా భోపాల్ ల నుండి తేలికగా చేరవచ్చు. నర్మదా వాలీ ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన అతి పెద్ద డాం లలో ఇది మూడవ డాం. డాం సైట్ వద్ద ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు చేయచ్చు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్.



Click it and Unblock the Notifications