Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జమ్మూ & కాశ్మీర్

జమ్మూ & కాశ్మీర్ - ప్రపంచ ప్రసిద్ధి  హిమాలయాల ఒడిలో...!

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిమాలయాల ఒడిలో కల జమ్మూ & కాశ్మీర్  ప్రదేశం,   సహజ అంద చందాలకు భారత దేశం లోనే కాదు ప్రపంచ వ్యాప్తం గా గుర్తించ బడింది. జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా మూడు ప్రాంతాలు కలిగి వుంది. అవి, కాశ్మీర్ వాలీ, జమ్మూ, మరియు లడఖ్ లు. ఈ ప్రాంత సరిహద్దులు హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలతో కలసి వున్నాయి. ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం కావటం వలన ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూనే వుంటుంది. ఈ ప్రదేశం, ప్రకృతి ప్రియులను, ఔత్సాహికులైన సాహస క్రీడాకారులను ఒకటిగానే ఆకర్షిస్తుంది.

ప్రఖ్యాత మొఘల్ చక్రవర్తి జహంగీర్, ఈ ప్రదేశ  అందాలకు  అబ్బుర పడి ఈ భూమి పై స్వర్గం వుంటే అది జమ్మూ కాశ్మీర్ మాత్రమేనని పలికాడు. బ్రహ్మాన్దమిన్ పర్వత శ్రేణులు, స్వచ్చమైన నీటి ప్రవాహాలు, ఎన్నో పుణ్య క్షేత్రాలు, మంచు చరియలు,ఉద్యాన వనాలు అన్నీ కూడా ఈ ప్రదేశ ఘనతను చాటుతూనే వుంటాయి. వాతావరణం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని సంవత్సరం పొడవునా సందర్చించ వచ్చు. అయితే, కాశ్మీర్ పర్యటనకు మార్చ్ నుండి అక్టోబర్ వరకు సరైన సమయం. ఈ సమయంలో ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదంగా వుంది సైట్ సీఇంగ్ కు అనుకూలం గా వుంటుంది.

ఈ ప్రాంతం లో చాలా భాగం డిసెంబర్ నుండి మార్చ్ వరకు మంచు చే కప్పబడి వుంటుంది. ఈ సమయం వింటర్ క్రీడలు ఆచరించే వారికీ అనుకూలం. జమ్మూ సందర్శనకు సెప్టెంబర్ మరియు మార్చ్ కాలం అనువైనది. లడఖ్ లో శీతాకాలం తీవ్రం కనుక వేసవి నెలలు అనుకూలం. భాషలు జమ్మూ & కాశ్మీర్ లో ఉర్దూ అధికార భాష. ఇది పెర్షియన్ లిపి లో వుంటుంది. రాష్ట్రం అంతటా దీనినే మాట్లాడతారు. కాశ్మీర్ లో ఉర్దూ భాష అధికం. కాశ్మీరీ, ఉర్దూ, డోగ్రి, పహారీ, బాల్టి, లడఖి, గోజ్రి, షినా, పష్తో భాషలు కూడా వినపడతాయి.

జమ్మూ & కాశ్మీర్ లో పర్యాటన జమ్మూ & కాశ్మీర్ ఇండియా లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. శ్రీనగర్ వేసవి రాజధాని గాను, జమ్మూ వింటర్ రాజధానిగాను పరిగణిస్తారు. పీర్ పాన్జాల్ మౌంటెన్ శ్రేణుల నుండి, గొప్పవైన హిమాలయాల వరకూ ఈ ప్రాంతం సాహస ఔత్సాహికులకు ప్రకృతి ప్రియులకు, యాత్రికులకు వారి వారికి అవసరమైన ప్రదేశాలు చూపుతోంది. కళా ప్రియులకు జమ్మూ లో కల మర మహల్ మ్యూజియం మరియు డోగ్రా ఆర్ట్ మ్యూజియం లు ఎల్లప్పుడూ ఆహ్వానం పలుకుతాయి.

వైష్ణో దేవి, దర్గా గరీబ్ షా, బాహు టెంపుల్, జియరాట్ బాబా బుద్దాన్ షా, శివ ఖొరి, పీర్ ఖో కావే టెంపుల్ వంటివి ప్రసిద్ధి గాంచిన కొన్ని మతపర ప్రదేశాలు. స్వచ్చమైన నీలి వర్ణపు నీరు, పర్వత శ్రేణులు, సరస్సులు, ఆహ్లాదకర వాతావరణం వంటి అంశాలు కాశ్మీర్ లోయ ప్రధాన ఆకర్షణలు. ఆపిల్ మరియు చెర్రీ పండ్ల తోటలు, షికారా సవారీలు, గొందోలా సవారీలు, హౌస్ బోటు లు, కాశ్మీరీ హస్త కళలు మొదలైనవి ఈ ప్రాంతం లోని కొన్ని ప్రత్యేకతలు. అనేక మసీదులు, దేవాలయాలయాలు కలిగి ఒక ప్రధాన యాత్రా స్థలంగా కూడా వుంది. వాటిలో హాజరాత్బాల్ మసీదు, జామా మసీదు, చరార్ యి షరీఫ్ , ఖీర్ భవాని  టెంపుల్, మార్తాండ్ సన్ టెంపుల్, శంకరాచార్య టెంపుల్, ప్రసిద్ధి. పర్యాటకులు ఇక్కడి ప్రసిద్ధ మొఘల్ ఉద్యానవనాలు అంటే నిషాత్ గార్డెన్, షాలిమార్ గార్డెన్, చాసం ఎ షాహీ గార్డెన్ వంటి మొఘలుల సామ్రాజ్య కాల వైభవోపేత నిర్మాణాలను సందర్శించవచ్చు. ఫహల్గాం, సోనా మార్గ, పత్ని టాప్,ద్రాస్స్ , గుల్మార్గ్, కార్గిల్ ప్రదేశాలు సహజ అందాలకు ప్రసిద్ధి. దాల్ సరస్సు, నాగిన్ సరస్సు , రెండూ కూడా ఈ ప్రాంతం లో ప్రసిద్ధి.

వివిధ జాతీయ పార్కులు, బయో స్పియర్ రిజర్వులు అంటే,, దాచిగాం వైల్డ్ లైఫ్ సంక్చురి, గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వు, హేమిస్ హై అల్టి టూడ వైల్డ్ లైఫ్ సంక్చురి , ఓవరా నేషనల్ పార్క్ వంటివి వన్య జంతు ప్రియులకు, ప్రకృతి ప్రియులకు ఆసక్తిని కలిగిస్తాయి. పర్వతారోహణ, హైకింగ్, ట్రెక్కింగ్, రాఫ్టింగ్, స్కై యింగ్  , ఇతర వింటర్ క్రీడలు ఆచరిన్చాలనుకునే సాహస క్రీడాకారులకు పుష్కలమైన అవకాశాలు కలవు. పత్ని టాప్, గుల్మార్గ్ క్రిమ్చి, కిష్టా  వార్ వంటి ప్రదేశాలు, సాహస క్రీడలకు ప్రసిద్ధి. లడఖ్ ప్రాంతం అధిక సంఖ్య లో కల  అక్కడి పురాతన బౌద్ధ ఆరామాలకు, భవనాలకు, అనేక ట్రెక్కింగ్ అవకాశాలకు ప్రసిద్ధి. వివాదాస్పద పాన్గోంగ్ లేక్, లడఖ్ ప్రదేశాలు అద్భుత సహజ అందాలతో వాటి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.  

జమ్మూ & కాశ్మీర్ ప్రదేశములు

  • కార్గిల్ 32
  • బారాముల్లా 13
  • సోనా మార్గ్ 56
  • లెహ్ 48
  • లడఖ్ 31
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed