1613 లో రాతి కొండలపై ఓర్చ్చ కి చెందిన రాజా బీర్ సింగ్ డియో చేత ఈ కోట నిర్మించబడినది. 16 నుండి 20 అడుగుల దట్టమైన గ్రానైట్ గోడ ఈ కోట చుట్టూ కనిపిస్తుంది. ఈ గోడకి ఉన్న పది ద్వారాలకి పరిపాలకుడి లేదా రాజ్యం కి సంబంధించిన పేర్లు పెట్టారు. చాంద్ గేటు, దతియా దర్వాజా, ఝార్నా గేటు, లక్ష్మి గేటు, ఓర్చ గేటు, సాగర్ గేటు, ఖందేరావు గేటు మరియు సైన్యార్ గేటు లు వీటి పేర్లు. కాల క్రమం లో కొన్ని గేటులు అదృశ్యమయ్యాయి.
1857 లో స్వాతంత్ర్య సమార పోరాటం లో ఝాన్సీ ఫోర్ట్ ప్రముఖ మైన పాత్ర పోషించింది.ఈ కోట గోడలపై బ్రిటిష్ సైన్యం పై రాణీ పోరాడిన చిత్రాలను గమనించవచ్చు. ఈ కోట లో ఉన్న మ్యూజియం ప్రదర్శితమయిన వాటిలో బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన కరక్ బిజ్లీ అనే ఫిరంగి ఉంది.



Click it and Unblock the Notifications