ఝాన్సీ కోటలో ఉన్నటువంటి ఝాన్సీ మ్యూజియం ఈ నగరం లో ని ముఖ్య ఆకర్షణ. ఇక్కడ ఆయుధాలు,టెర్రకోట వస్తువులు, విగ్రహాలు, వస్త్రాలు, రాగి, బంగారం మరియు వెండి నాణాలు మరియు విగ్రహాల వంటి వస్తువుల విశేష సేకరణ ని ప్రదర్శిస్తారు.
ఈ ప్రదర్శనలు అప్పటి చందేలా రాజుల మరియు బుందేల్ఖండ్ నగరం యొక్క చారిత్రక వారసత్వ విశేషాలను తెలియచేస్తాయి. ఇక్కడి గుప్తుల కాలానికి చెందిన చారిత్రక చిత్రాల ప్రదర్శన పురాతన భారతీయ చరిత్ర విద్యార్ధులకు ప్రత్యేక ఆకర్షణ.
1857 లో బ్రిటిష్ వారు తిరుగుబాటు దారులని అణచివెయ్యడానికి వాడినటువంటి ఆయుధాలు మందు గుండు సామాగ్రి ని కూడా ప్రదర్శనకు ఉంచుతారు. చందేలాలు మరియు బుందేలాలు యొక్క పాలనా సమయానికి చెందిన ప్రదర్శనలు కూడా ఉంటాయి. ప్రదర్శనలో ఉన్న ఝాన్సీ రాణి మరియు ఆమె తోటి మరాఠా దేశ భక్తులు వాడినటువంటి ఆయుధాలు పర్యాటకులను ప్రత్యేక ఆసక్తి ని కలిగించక మానవు.



Click it and Unblock the Notifications