జోగ్ ఫాల్స్ కు 63 కి.మీ. దూరంలో సాగర్ తాలూకాలో లింగనమక్కి డ్యామ్ ఉంటుంది. ఈ ప్రదేశం అంతా అడవులు వ్యాపించి లోయలుగా ఉంటుంది. డ్యామ్ నుండి పచ్చగా కనపడుతుంది. ఇక్కడ ఫొటోలు నిషేధం. దీనిని వర్షాకాలంలో సందర్శించాలి. లింగన మక్కి డ్యామ్ 1964 లో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నిర్మించారు. ఇది 2.4 కి.మీ. పొడవుగలది 1819 అడుగుల ఎత్తు ఉండి నీటి ప్రభావం 300 కి.మీ. దూరం విస్తరించింది. దీని కింద సాగులో కొంత పల్లపు మరికొంత మెరక భూములుగా ఉన్నాయి. ఈ డ్యామ్ మహాత్మ గాంధీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ యూనిట్ కు మెయిన్ ఫీడర్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications