మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కల జున్నార్ గుహలు పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ గుహలను సుమారు 2 వ లేదా 3వ శతాబ్దంలో కనుగొన్నారు. పురావస్తు శాఖకు మరియు చరిత్ర పట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రదేశం ఎంతో సమాచారాన్నిస్తుంది. ఎన్నోశిల్పాలు, మరియు చెక్కడాలు ఇక్కడ కనపడతాయి. జున్నార్ గుహలను మూడు భాగాలుగా విభజించారు. అవి మన్మోడి హిల్ గ్రూప్, గణేశ లేనా గ్రూప్ మరియు తుల్జా లేనా గ్రూప్ అని వ్యవహరిస్తారు. మన్మోడి హిల్ గ్రూప్ అదే పేరుగల కొండలో ఉండటంచే మరింత ప్రసిద్ధి గాంచాయి. అద్భుత శిల్పకళా చతురత వీటిలో కనపడుతుంది. తుల్జా గ్రూప్ అద్భుతమైన దాని గుండ్రటి డోమ్ సీలింగ్ కారణంగా చైత్య హాలు కు ప్రసిద్ధి గాంచింది. గణేశ లేనా గ్రూపు గుహలు జున్నార్ నుండి 4 కి.మీ.ల దూరంలో దక్షిణ దిక్కుగా ఉండి వివిధ విహారాలు, గదులు కలిగి ఉంటాయి. ఆరవ చైత్య గుహ మరియు గణేశ లేనా గుహలు కూడా ఎంతో ప్రసిద్ధి గాంచినవి.



Click it and Unblock the Notifications