సెయింట్ డామినిక్స్ కేధడ్రల్ ను మొదటగా చర్చిగా నిర్మించారు. ఇది వయంపు పురయిడం లో చిట్టార్ నది ఒడ్డున కలదు. కేధడ్రాల్ ప్రదేశం అందంగా ఉంటుంది. దీనిని 1826లో నిర్మించారు. మరోమారు 1945 లో పునర్నిర్మించారు. నిర్మాణం 1961 లో పూర్తయింది. 1977 లో మార్చి 17వతేదీన ఈ చర్చి 150వ జన్మదినం చేసుకుంది. అపుడే దీనిని కేధడ్రల్ గా ప్రకటించారు. ఈ కేధడ్రల్ అధిక సంఖ్యలో భక్తులను పర్యాటకులను ప్రతి సంవత్సరం ఆకర్షిస్తూంటుంది.



Click it and Unblock the Notifications