కర్నాల బర్డ్ శాంక్చురీ స్వర్గాన్ని తలపిస్తుంది. ఇది కోట కింది భాగంలో ఉంటుంది. దీనిని 1968 సంవత్సరంలో స్ధాపించారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల పక్షులు మీరు చూడవచ్చు. పక్షి సందర్శకులు సుమారు 150 రకాల పక్షుల కిల కిలారావాలను విని ఆనందించవచ్చు. మరో 37 రకాల జాతులు వలసలు వచ్చి పోతూంటాయి. మచ్చలు కల వడ్రంగి పిట్ట, యాషీ మినిమెట్, పారడైజ్ ఫ్లై కేచర్, రెడ్ వెంటెడ్ బుల్ బుల్, మాగ్ పీ రాబిన్, రాకెట్ తోక ద్రోంగో వంటి వి కొన్ని అరుదైన జాతులు ఇక్కడ కనపడతాయి. మైనా మరియు గుడ్ల గూబల వంటివి కూడా చూడవచ్చు. ఈ శాంక్చురీ ప్రాంతం అంతా అందంగా ఉంటుంది. పచ్చగా, కన్నుల విందుగా కనపడుతుంది. మీ ముఖంలో ఆనందం తాండవిస్తుంది.



Click it and Unblock the Notifications