శ్రీమంత శంకరదేవునికి ఎంతో గొప్ప శిష్యుడు శ్రీ శ్రీ మాధబదేవ్ పుట్టిన ప్రాంతమే మాధబదేవ్ థాన్. బోర్బలి గ్రామానికి దగ్గరగా ఉన్న మాధబదేవ్ థాన్ ను లేటేకు పుఖురి అని కూడా అంటారు. లేటేకు పుఖురి, అస్సాం లోని లఖింపూర్ జిల్లాలో ఉంది.
1489 లో అస్సాంలో పుట్టిన శ్రీ శ్రీ మాధబదేవ్ ను వైష్ణవ మతానికి చెందిన ముఖ్య గురువుగా పరిగణిస్తారు. శ్రీమంత శంకరదేవకు ఎంతో విశ్వసనీయ శిష్యునిగానే కాక తన సృజనాత్మక, తెలివితేటలకు కూడా పేరొందాడు. శ్రీమంత శంకరదేవుని మరణం తర్వాత అస్సాంలోని వైష్ణవమతస్తులు శ్రీ శ్రీ మాధబదేవ్ ను తమ ధార్మిక గురువుగా అనుసరించారు. శ్రీ శ్రీ మాధబదేవ్ ప్రత్యేకంగా ప్రవచించిన ‘బోర్గీత్స్’ లేదా శ్లోకాలు ప్రసిద్ధి చెందటమే కాక ఈ రోజున కూడా నంఘర్ లలో వాటిని వల్లిస్తుంటారు.
మాధబదేవ్ థాన్ లో శ్రీ శ్రీ మాధబదేవ్ కాలానికి చెందిన పవిత్ర పుస్తకాల భారీ సేకరణ, సాంస్కృతిక వారసత్వం, పురాతన రాతప్రతులు ఉన్నాయి. ఈ అరుదైన కళాఖండాలను చూడటానికి పర్యాటకులకు అవకాశం కల్పించారు.



Click it and Unblock the Notifications