హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ దగ్గరలో వున్న ప్రముఖ గ్రామం తండి. సముద్ర మట్టానికి 2573 మీటర్ల ఎత్తున చంద్రా, భాగా నదుల సంగమంలో కీలాంగ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ గ్రామం. రెవెన్యూ, సెటిల్మెంట్ రికార్డుల ప్రకారం రాజా రాణా చంద్ రామ్ ఈ ప్రాంతాన్ని చండి అనే పేరిట ఏర్పాటు చేసాడు. ఈ ప్రాంతానికి చెందిన అనేక ఐతిహ్యాలు వున్నాయి. అందులో ఒకదాని ప్రకారం చంద్రుడి కొడుకు చంద్రుడు, సూర్యుడి కూతురు భాగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళు ఇద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారని పురాణం. మనాలి – లెహ్ మార్గంలో కీలాంగ్ కు ఇంకా ఉత్తరానికి వెళ్లాలనుకునే యాత్రికులకు తండి లోనే చివరి పెట్రోల్ స్టేషన్ వుంది.