1870 లో ఫూల్ మహల్ పాలస్ నిర్మించబడింది. కిషన్ గర్ మహారాజు రాజ మందిరంగా ఫూల్ మహల్ పాలస్ ని ఉపయోగించే వారు. ఇది నగరానికి నడి బొడ్డులో ఉంది. ప్రస్తుతం పర్యాటకుల కోసం దీనిని అత్యాధునిక వసతులతో అందుబాటులో ,అన్ని సౌకర్యాలతో బొటిక్ హోటల్ గా తీర్చిదిద్దారు.పర్యాటకులని ఆకర్షించే విధంగా హోటల్ గదులు అలంకరింపబడ్డాయి . అందమైన చిత్రలేఖనాలతో హోటల్ గదులను ముస్తాబు చేసారు . గదులలో అమర్చిన ప్రాచిన రాచరికపు వస్తువులు, బ్రిటిష్ ఫర్నీచర్ లు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. భారతీయ, చైనీస్ మరియు పాశ్చాత్యపు వంటకాల రుచులను అతిధులకు అందుబాటు లోకి తెచ్చారు.అందమైన ప్రకృతిలో మానవ నిర్మితమైన సరస్సు తో ఈ పాలస్ యొక్క అందాలు ద్విగుణీకృతం అవుతాయి . లైబ్రరీ, జాగింగ్ ట్రాక్ లు, లాండ్రి వంటి సౌకర్యాలని పర్యాటకులు ఈ హోటల్ లో పొందవచ్చుపర్యాటకుల కోసం ఏర్పాటు చేసే విశిష్టమైన రాజస్థాని సంగీత, నృత్య కళలు పర్యాటకులకి ఆనందాన్ని పంచుతాయి. ఔత్సాహిక పర్యాటకులకి ప్రతి రోజు యోగా తరగతులు కూడా ఏర్పాటు చేస్తారు. ఇన్ని వసతులు కలిగినందువల్ల, కిషన్ గర్ వచ్చిన పర్యాటకులు ఖచ్చితం గా సందర్శించవలసిన ప్రదేశంగా ఈ ఫూల్ మహల్ పాలస్ ని చెప్పుకోనవచ్చును.



Click it and Unblock the Notifications