గగన్ బావడా కొల్హాపూర్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో వున్న అందమైన పర్వత కేంద్రం.ఈ ప్రశాంత పర్వత కేంద్రం అందించే పుష్కలమైన జలపాతాలు, దట్టమైన పచ్చదనం, అద్భుత పరిసరాలు ప్రకృతి ప్రేమికులను ఆనందపరుస్తాయి. సాహసవీరులు ఇక్కడ పర్వతారోహణ చేయడం ఏ కారణం చేతా వదులుకోకూడదు.ఇక్కడి ఆశ్రమం లో ధ్యాన, యోగా ల కోసం ఔత్సాహికులు ఏటా పేర్లు నమోదు చేసుకుంటారు. ఎంతైనా ప్రకృతి మాత ఒడిలో కాక మీకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది.



Click it and Unblock the Notifications