కొల్లాం కి 60 కి.మి. దూరం లో ఉన్న ప్రసిద్ద తీర్థయాత్రా కేంద్రమిది. దట్టమైన అడవులు, గుడులు, వాటర్ ఫాల్స్ ఈ ప్రాంత ప్రత్యేకతలు. ఈ ప్రాంత ప్రధాన యాత్రా ఆకర్షణ అయ్యప్పస్వామి అచెంకాయిల్ సాస్థ గుడి. భక్తులని చరిత్ర ప్రేమికులని సమానంగా ఆకర్షించే ఈ గుడిలోని సాస్థ విగ్రహం క్రీస్తుపూర్వమే ప్రతిష్ఠింపబడిందని అంచనా. డిసంబర్-జనవరి లో జరిగే మండల పూజ మరియు జనవరి-ఫిబ్రవరి లో జరిగే రేవతి పండుగ సమయాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడి పుష్పాభిషేకం ఈ గుడిని దక్షిణ భారతం లో ని మిగతా గుడులకి భిన్నమైనదిగా చేస్తుంది. కుభవురుట్టి వాటర్ ఫాల్స్ మరియు మనలార్ ఫాల్స్ ఇతర ప్రధాన ఆకర్షణలు. అచెంకాయిల్ సాస్థ గుడి దారిలో ఉన్న ఈ రెండు వాటర్ ఫాల్స్ సందర్శకులకి కనువిందు చేస్తాయి.



Click it and Unblock the Notifications