Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుద్రేముఖ్ » ఆకర్షణలు » కుద్రేముఖ్ నేషనల్ పార్క్

కుద్రేముఖ్ నేషనల్ పార్క్, కుద్రేముఖ్

6

కుద్రేముఖ్ లో ప్రధాన ఆకర్షణ అంటే కుద్రేముఖ్ నేషనల్ పార్క్ మాత్రమే. ఇది పడమటి కనుమల ప్రాంతంలో ఉంది.  ఈ పార్క్ ను 1987 లో నేషనల్ పార్క్ గా ప్రకటించారు. సుమారు 600 చ. మీ. ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. వాస్తవానికి ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ ప్రాంతాన్ని నేషనల్ పార్క్ చేయవలసినదిగా ప్రఖ్యాత పర్యావరణ వేత్త డా. ఉల్లాస్ కారంత్ ఎంతో పట్టు పట్టారు. ఆయన సిఫార్సుల మేరకు కర్నాటక ప్రభుత్వం దీనిని ఒక జాతీయ పార్క్ గా ప్రకటించింది. ఈ ప్రదేశాన్ని గ్లోబల్ టైగర్ కన్సర్వేషన్ ప్రియారిటీ - 1 గా సంరక్షిస్తున్నారను. వన్యప్రాణుల సంరక్షణా ప్రదేశంగా ప్రకటించారు. వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ మరియు వరల్డ్ వైడ్ ఫండ్ - అమెరికా సంస్ధలు కూడా కుద్రేముఖ్ నేషనల్ పార్క్ ను  తమ సంరక్షణ జాబితాలో చేర్చుకున్నాయి. చిరుతలు, సింహాలు, కోతులు, అటవి పందులుఅడవి కుక్కలు వంటి జంతువులకు ఈ పార్క్ నిలయంగా ఉంది. పార్క్ మొత్తం చూడాలంటే, పర్యాటకులకు ఉన్నత అధికార్ల ముందస్తు అనుమతులు కావాలి. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ వద్ద బస చేయాలంటే, అటవీ శాఖ రెస్ట్ హౌస్ కలదు. ఈ పార్క్ సందర్శనకు పర్యాటకులు స్ధానిక బస్ లు లేదా ఆటో లేదా రిక్షాలను ఉపయోగించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun