ఈ దేవాలయాన్ని రాణా కుంభ రాజు 1460లో నిర్మించారు. ఈ గుడి కుంభాల ఘర్ కోట కింది భాగంలో కలదు. పర్యాటకులు దీనిపై మేవార్ చరిత్రను శిలా శాసన రూపంలా వ్రాసి ఉండటం గమనిస్తారు. ఇక్కడ వ్రాసిన శాసనం మేరకు చరిత్ర గుహిల్ కాలం నుండి రాణా కుంభ పాలన వరకు కలదు. మేవార్ స్ధాపకుడు గుహిల్ అని వ్రాశారు.
అయితే, ప్రస్తుతం, ఈ శాసన ఫలకాలు ఉదయపూర్ మ్యూజియంలో భధ్ర పరచబడి ఉన్నాయి. కుబేరుడి కుడ్య చిత్రం మరియు రెండు స్తూపాలను కూడా దేవాలయంలో చూడవచ్చు. ఈ రెండు స్తూపాలు రాజులైన రాణా కుంభ మరియు పృధ్వీ రాజ్ చౌహాన్ లవి. దేవాలయానికి సమీపంలో అందమైన పెద్ద రిజర్వాయర్ కలదు.



Click it and Unblock the Notifications