కాన్ స్తాన్తియా లక్నోలో పర్యాటకులు బాగా చూసే ప్రదేశాలలో ఒకటి. ఇది ఒక ప్రాన్సు దేశపు మేజర్ జనరల్ నివాసం. దీనిని 1751 లో నిర్మించారు. ఈ భవనం పై అనేక కధలు వున్నాయి. వాటిలో ఒకటి ఈ మజర్ జనరల్ కాన్ స్తాన్సు అనే ఫ్రాన్స్ లేడీ తో ప్రేమలో పడ్డాడని ఆమె పేరుతో దీనిని నిర్మించారని చెపుతారు.
ఈ భవనం ఎంతో వైభవ శిల్ప శైలి కలిగి సుమారు 200 ఎకరాలలో నిర్మించబడినది. లోపలి వెళితే చాలు ఎన్నో రకాల ఆకర్షణీయ విగ్రహాలు, జంతువుల బొమ్మలు కనపడతాయి. ఈ పాలస్ లో లక్నో లో ప్రసిద్ధి చెందిన మార్టిన్ స్కూల్ కలదు. ఆయన మరణం తర్వాత ఆయన వీలునామా మేరకు కాలేజ్ కూడా నిర్మించారు. ఇక్కడ అన్ని మతాల వారికి విద్యా బోధన చేస్తారు.



Click it and Unblock the Notifications