హుస్సైనాబాద్ క్లాక్ టవర్ హుస్సైనబాద్ ఇమామ్బర కు ఎదురుగా ప్రఖ్యాత రూమి దర్వాజా కు ఒక మెయిలు దూరం లో కలదు. సుమారు 221 అడుగుల ఎత్తుకల ఈ భవనం దేశం లోనే ఎత్తైనదని చెప్పవచ్చు.
1887 లో నిర్మించిన ఈ క్లాక్ టవర్ ఇండియా లో విక్టోరియా నిర్మాణ శైలి కి ఒక ఉదాహరణ. దీనిని నవాబ్ నసీరుద్దిన్ మొదలు పెట్టగా, ఆయన మరణానంతరం పూర్తి చేసారు. దీని వ్యయం ఆ రోజులలో రూ. 1.74 లక్షలు అయింది.
ఈ క్లాక్ లోని భాగాలు లండన్ నుండి తెప్పించిన గన్ మెటల్ తో తయారు చేసారు. దీని పెండ్యులం వెస్ట్ మినిస్టర్ క్లాక్ కంటే పెద్దది. గంటలు కొడుతూ ఇది ఒక పువ్వు ఆకారాపు డయల్ పై కదులుతుంది.



Click it and Unblock the Notifications