అయిదు రథాలు లేదా స్థానిక భాషలో పంచ రథాలు అని చెప్పబడే ఈ నిర్మాణం ఏక శీలా శిల్పశైలి కి అద్దం పడుతుంది. తీర సముద్ర టెంపుల్ వలెనె, పంచ రథాలు కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. రాజు మహేంద్రవర్మ - 1 మరియు అతని వారసుడు నరసింహ వర్మన్ -1 పాలనలలో నిర్మించబడిన ఈ నిర్మాణ రహస్యం చరిత్రకారులకు ఇంతవరకు అంతు పట్టడం లేదు.
నేటికి వీటి నిర్మాణం లో కొన్ని భాగాలు అసంపూర్ణంగా మిగిలివున్నాయి. దీని నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ రాయి దీనిని ఇక్కడి సముద్ర ఉప్పు గాలుల నుండి, తీరం లో 13వ శతాబ్దంలో వచ్చిన పెను సునామి ల నుండి చక్కగా రక్షిస్తోంది. ఈ నిర్మాణంలో కల అయిదు ఏకశిలా క్షేత్రాలకు అయిదుగురు పాండవుల మరియు ద్రౌపది పేరు పెట్టారు. ద్రావిడుల శిల్పశైలికి ఈ నిర్మాణం అద్దం పడుతుంది.



Click it and Unblock the Notifications