దీనిని 18వ శతాబ్దంలో హోల్కర్ రాష్ట్ర అప్పటి పాలకురాలు, మహారాణి అహిల్య బాయి హోల్కర్ కట్టించారు. ఇండియా లో ఉన్న అన్ని పవిత్రమైన నడులన్నిటిలో కల్లా, చాలా పవిత్రమైనదిగా నర్మద నదిని భావిస్తారు. రాత్రుళ్ళు, గంగ, తను ఆశుభ్రమయ్యానని అనుభూతి చెందినప్పుడల్లా, నల్ల ఆవు రూపంలోవొచ్చి ఈ నర్మద నదిలో శుభ్రపరచుకొని వెళుతుందని చెపుతుంటారు.
ఇక్కడ పవిత్ర స్నానమాచరించటానికి భక్తులు గుంపులుగుంపులుగా వొస్తుంటారు. ఈ ఘాట్ నుండి నదీదృశ్యం ఉత్కంఠభరితంగా ఉంటుంది. రాష్ట్రమంతటా ఈ నది ప్రవహించటం వలన, దీనికి మరియు మధ్య ప్రదేశ్ ప్రజల మధ్యన విడదీయరాని బంధం ఏర్పడింది.
దీని ప్రత్యేకత వలన, నర్మదా ఘాట్ అప్పటి నుండి మహేశ్వర్ ఒక పవిత్ర భాగంగా ఉన్నది. ఇక్కడికి ప్రతిరోజూ వేలకొద్ది యాత్రికులు భక్తితో, మరియు పవిత్రతతో పవిత్ర స్నానం ఆచరించటానికి వొస్తూ ఉండటం వలన మహేశ్వర్ అద్భుత పర్యాటక ప్రదేశంగా నిలిచింది.



Click it and Unblock the Notifications