మలయత్తూర్ చర్చి ప్రపంచ ఖ్యాతి గాంచినది. అంతర్జాతీయ గుర్తింపు ఈ చర్చికి లభించింది. సీజన్ తో నిమిత్తం లేకుండా భక్తులు ఈ చర్చికి వస్తూంటారు. జీసస్ శిష్యుడైన సెయింట్ ధామస్ ఇక్కడకు వచ్చి తన సందేశాన్ని ఇచ్చాడని చెపుతారు. సెయింట్ ధామస్ వందల సంవత్సరాల కిందట స్ధాపించిన మేరీ విగ్రహం కల ప్రదేశంలోనే నేటి మలయత్తూర్ చర్చి కలదని చెపుతారు. మలయత్తూర్ కొండలపై గల ఈ మత సంస్ధ ప్రతి సంవత్సరం మిలియన్ల కొలది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ చర్చిని గ్రీసు మరియు రోమన్ శిల్ప శైలిలో నిర్మించారు. ఇక్కడ అనేక చెక్కడాలు, పెయింటింగులు, ఫైవ్ జాయ్ ఫుల్ మిస్టరీస్ ఆఫ్ జీసస్ క్రీస్ట్ వంటివి చర్చి గోడలపై కలవు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో మలయత్తూర్ పెరున్నాల్ అనే పండుగ నిర్వహిస్తారు. ఇక్కడే కల మర్తోమా మండపం, సన్నిధి, గోల్డెన్ క్రాస్, మిరక్యులస్ వాటర్ స్ప్రింగ్ , సెయింట్ ధామస్ ఫుట్ ప్రింట్, అతని పెద్ద విగ్రహం వంటివి చూడదగిన ప్రదేశాలు.



Click it and Unblock the Notifications