మాల్పే సముద్ర తీరంలో ఉన్న సెయింట్ మేరీ ద్వీపం మరోపేరు కోకోనట్ ద్వీపం అని కూడా చెపుతారు. దీనిలో నాలుగు ద్వీపాలున్నాయి. ఈ ద్వీపాలలో లావా వెదజల్లబడిన చరియలు ప్రత్యేక ఆకర్షణ. ఇండియాలో ప్రభుత్వం ప్రకటించిన 26 భౌగోళిక స్మారకాలలో ఈ ద్వీపం ఒకటి. పోర్చుగీస్ ప్రయాణీకుడు వాస్కోడ గామా తాను కేరళలోని కప్పడ్ వెళ్ళే సమయంలో ఇక్కడ దిగాడు. ప్రస్తుతానికి ఈ ద్వీపంలో భవనాలు లేక జంతువులు కూడా లేకుండా కొద్దిపాటి పార్క్ బెంచీలతో వెల వెల బోతోంది. దీనికి సమీప విమానాశ్రయం మంగుళూరు. 58 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రయాణీకులు ఫెర్రీ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఇవి మాల్పే హార్బర్ డాక్ నుండి ఉంటాయి. ఉడుపి పట్టణానికి మాల్పే 4 కి.మీ. రోడ్డు ప్రయాణం తేలిక. ప్రయాణీకులు ఎక్కువమంది ఉంటే, ఫెర్రీ ఏర్పాటు చేస్తారు.



Click it and Unblock the Notifications