మనాలి నుండి 16 కిలోమీటర్ల దూరం లో నెలకొని ఉన్న కోఠి సముద్ర మట్టం నుండి 2500 మీటర్ల ఎత్తులో ఉన్న సుందరమైన గ్రామం. కోఠి గార్జ్ కి ప్రసిద్దమైన ఈ ప్రాంతం లో ఇరుకైన లోయ యొక్క అందాలు అలాగే బీస్ నది యొక్క అందాలు తిలకించవచ్చు. రోడ్డు మార్గం ద్వారా కొన్ని గంటల కాలి నడకతో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. రాళ్ల నుండి ఉద్భవించే వేడి నీటి కొలనులు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణ. పారాగ్లైడింగ్ కి మూలంగా వ్యవహరించబడే ఈ ప్రాంతం ఏరో స్పోర్ట్స్ ల ఔత్సాహికులకి అనువైనది.
మే నుండి అక్టోబర్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. సోలాంగ్ వాలీ సందర్శనలో భాగంగా సమీపం లో ఉన్న కోఠి ని కూడా సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications