ప్రధాన మార్కెట్ నుండి 3 కిలోమీటర్ల దూరం లో ఉన్న మను టెంపుల్ ఓల్డ్ మనాలి లో బీస్ నది ఒడ్డున ఉంది. పురాణాల ప్రకారం, భూమి పై మనుష్య జాతిని సృష్టించిన మను కి సంబంధించిన ఒక్కగానొక్క పుణ్యక్షేత్రం ఇది. ఏడు చక్రాల సృష్టి మరియు వినాశనం తరువాత ఈ ప్రాంతం లో కి మను వచ్చాడని అంటారు. భూమిపై పాదం మోపిన తరువాత ఆ మహర్షి ధ్యానం చేసిన చోటే ఈ ఆలయం అని అంటారు. జారుగా ఉన్న రాతి పై కొంత నడక ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవాలి.



Click it and Unblock the Notifications