మనాలి నుండి 3 కిలోమీటర్ల దూరం లో ఉన్న సుందరమైన ప్రాంతం ఓల్డ్ మనాలి. పురాతనమైన గెస్ట్ హౌస్ లకి , ఆలయాలకి, మఠం, మరియు వివిధ పండ్ల తోటలకి ఈ ప్రాంతం ప్రసిద్ది. మనాలి గర్ ఫోర్ట్, మను మహర్షి టెంపుల్ వంటి వి ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.
మే నుండి అక్టోబర్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. సమీపం లో ఉన్న సోలాంగ్ వాలీ మరియు హడింబ టెంపుల్ ని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు.