మనాలి నుండి 14 కిలోమీటర్ల దూరం లో ఉన్న సోలంగ్ వాలీ లో స్కైంగ్ అవకాశం కలదు. అనుభవం లేని స్కైయెర్స్ కి ఈ వాలీ లో ఉన్న రెండు స్లోప్ లు అనుకూలంగా ఉంటాయి. పర్యాటకుల సౌకర్యార్ధం ఇక్కడ రెండు లిఫ్ట్ లు నిర్మించారు.
మర్హి, గుల్బ, దుండి, రోహతంగ్ పాస్ మరియు పాటల్సు వంటి ప్రదేశాలలో పర్యాటకులు స్కైంగ్ ని ఆనందించవచ్చు. డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలు స్కైంగ్ కి అనుకూలం గా ఉంటాయి. ఈ సమయంలో ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం లో కూడా పాటల్సు మరియు రోహతంగ్ ప్రాంతం లో పర్యాటకులు స్కైంగ్ ని ఆనందించవచ్చు.
స్థానిక స్కైంగ్ ఆపరేటర్ ల నుండి మౌలిక స్కైంగ్ ఉపకరణాలు పొందవచ్చు. వీరు శిక్షకులను కూడా అందిస్తారు. మూడు లేదా అయిదు రోజుల నిడివి కలిగిన స్కై టూర్లని కూడా పర్యాటకులు ఎంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications