మనాలి లో ఉన్న అత్యంత సాహసోపేతమైన ఆక్టివిటీస్ లో ట్రెక్కింగ్ ఒకటి. ట్రెక్కింగ్ ట్రైల్స్ లో ఎక్కువ శాతం అందమైన ఆపిల్ పండ్ల తోటలు, పచ్చిక పొలాలు, అందమైన సరస్సులు, చిన్న కుగ్రామాలను దాటతాయి. మనాలి-హంప్ట పాస్, పిన్ పార్వతి పాస్, సార్ పాస్, మరియు చండేర్ఖాని పాస్ లు ప్రాచుర్యం పొందినవి. బీస్ కుండ్, బర్లచల, డియో టిబ్బా బేస్ క్యాంపు మరియు బాల్ తాల్ లేక్ వంటివి మరికొన్ని ప్రసిద్దమైన ట్రైల్స్.
మలనా వాలీ కి ఏడు రోజుల ట్రెక్, చంద్రతల్ కి 11 రోజుల ట్రెక్ లు మనాలి లో ఉన్న ప్రసిద్ద మైన ట్రెక్స్. ఎత్తైన ప్రాంతం లో ట్రెక్కింగ్ చెయ్యాలనుకునే పర్యాటకులు మనాలి లో ప్రారంభమయ్యి షీ ఘరు, తోప్కో గొంగ్మో, బాలు గిర, చంద్ర తాల్ లేక్ మరియు చోటా దారా వంటి ట్రెక్ లని ఎంచుకోవచ్చు. ఈ ట్రెక్కింగ్ మార్గాలు ట్రెక్కింగ్ చేసేవాళ్ళని సముద్ర మట్టం నుండి 4800 ఎత్తుకి తీసుకు వెళతాయి.
జూన్ నుండి అక్టోబర్ వరకు మనాలి లో ట్రెక్కింగ్ చేసేందుకు అనువైన సమయం.