మనాలి ని సందర్శించే పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్న కొత్త క్రీడ జోర్బింగ్. ఈ క్రీడలో, ఒక వ్యక్తిని జోర్బ్ లో కి పంపిస్తారు. జోర్బ్ అంటే పారదర్శకంగా ఉండే బంతి. ఆ తరువాత జోర్బ్ ని దోర్లిస్తారు. ఒక జోర్బ్ లో గరిష్టంగా 120 కిలో గ్రాముల బరువు మించని ఇద్దరు వ్యక్తులు పడతారు. జోర్బ్ లో ఉన్న హేండిల్ ని అందులో ఉన్న వ్యక్తులు గట్టిగా పట్టుకోవాలి. 100 మీటర్ల ఎత్తున్న స్లోప్ నుండి ఈ జోర్బ్ ని దోర్లిస్తారు. అత్యంత ఉత్సాహవంతులు, 150 మీటర్ల ఎత్తున్న స్లోప్ నుండి ఈ జోర్బింగ్ ని ప్రయత్నించవచ్చు.



Click it and Unblock the Notifications