మండి జిల్లాలో ఉన్న షికారి దేవి ఆలయానికి సమీపం లో ఉన్న షికారి దేవి సాంచురీ 1962 వైల్డ్ లైఫ్ సాంచురీ గా ప్రకటించబడింది. వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలాలకి ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ నివాసం. గోరాల్, మోనాల్, బ్లాక్-బీర్, మస్క్ బీర్, కాట్ లెపర్డ్ మరియు హిమాలయన్ బ్లాక్ బీర్ వంటి వి వీటిలో కొన్ని. హిమాలయన్ పామ్ సివెట్, బార్కింగ్ బీర్, మార్టెన్, ఇండియన్ పోర్కుపైన్, కాశ్మీరీ ఫ్లైయింగ్ స్క్విర్రెల్, మాస్క్ డీర్, కామన్ లంగూర్, లెపర్డ్, కామన్ స్క్విర్రెల్ మరియు స్నో లెపర్డ్ లు ఈ సాంచురీ లో నివాసం ఉంటున్నాయి.
బాన్ ఓక్, వెస్ట్రన్ మిక్స్డ్ శంఖాకార చెట్లు, ఖర్సు ఓక్, వెస్ట్ హిమాలయన్ అప్పర్ ఓక్, తేమ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు, సబ్ ఆల్పైన్ పాస్చర్స్ లు ఇక్కడి వృక్ష సంపదలో భాగం. ఏప్రిల్ మరియు మే నేలలతో పటు ఆగష్టు మరియు అక్టోబర్ నెల లు ఈ సాంచురీని సందర్శించేందుకు అనువైన నెలలు. కర్సోగ్-చింది మార్గం గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications