ఈ చర్చిని 1568లో పోర్చుగీసు పాలకులు నిర్మించారు. అతిపురాతనమైన ఈ చర్చిని 1910 సంవత్సరంలో మరోమారు రోమన్ డిజైన్లతో పునర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో మంగుళూరు సిటీలోని హంపన కట్ట అనే ప్రాంతంలో ఇది ఉంది. 1910 సంవత్సరంలో ఫాదర్ హెచ్ ఐ బుసోని అనే పార్శీ పూజారి పాత భవనాన్ని కూలగొట్టి కొత్త నిర్మాణం పని మొదలు పెట్టాడు. ఈ కేధడ్రల్ రొజారియో హైస్కూల్ అనే ఒక హైస్కూల్ కూడా నడుపుతుంది. పేదలు, వెనుకబడిన ప్రజల కొరకు స్ధాపించబడిన సెయింట్ విన్సెంట్ పౌల్ సొసైటీ కూడా దీనిచే నడుపబడుతోంది. ఈ చర్చికి ఎన్నో నష్టాలు జరిగాయి. ఈ భవనాన్ని టిప్పు సుల్తాన్ సైన్య బలగాలు 1784 లో ఒకసారి నాశనం చేశాయి. కేధడ్రల్ కు ఒక డోమ్ మరియు దానిపై ఒక క్రాస్ ఉంటుంది. ప్రతిరాత్రి దీనిపై లైట్ వెలుగుతూంటుంది. ఇది సముద్ర ప్రయాణం చేసేవారికి సూచనగా ఉండేది. వర్జిన్ మేరీ విగ్రహం ఒకప్పుడు ఇక్కడి బెస్తవారికి వారి వలలో దొరికిందని చెపుతారు. ఎంతో చరిత్ర కల ఈ కేధడ్రల్ తప్పక సందర్శించదగిన ప్రదేశం.



Click it and Unblock the Notifications