ఖీర్ గంగా మణికరణ్ లోని ఒక పేరెన్నిక గన్న పర్యాటక కేంద్రం. ఇక్కడి వేడి నీటి బుగ్గల్లోని తెల్లటి నీటికి ఔషధ గుణాలు ఉన్నాయంటారు. ఖీర్ గంగా అనే పేరు వ్యుత్పత్తి గా ఇక్కడి తెల్లటి నీటి నుంచి వచ్చింది. ఈ బుగ్గల్లో వుండే గంధకం వల్ల ఈ నీరు పాల లాగా తెల్లగా వుంటుంది, ఆ గంధకం నీటి ఉపరితలానికి తేలుతుంది.
ఖీర్ గంగా నుంచి 2 కిలోమీటర్ల కొద్ది దూరంలో వున్న మంటలాయి తన ప్రాకృతిక మనోహర దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. పార్వతి నది, తెల్లటి మంచు పర్వతాల అందమైన దృశ్యాలను అందించే పుల్గా ఖీర్ గంగా నుంచి పర్వతారోహణ మార్గంలో ఉంటుంది.