Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మణిపూర్

మణిపూర్ పర్యటన - ఆసక్తికర అంశాల కలయిక  !

పర్యటన పట్ల ఆసక్తి కలవారికి మణిపూర్ పర్యటన ఒక అద్భుతం వలే వుంటుంది. ఈ ప్రాంతం లోకాల శిరూయి లిలి, సాన్గాయి దీర, లోక్ తక సరస్సు లోని తేలియాడే ద్వీపాలు, విస్తారమైన పచ్చటి ప్రదేశాలు, అక్కడ కల ఒక మోస్తరు వాతావరణం మరియు ఇక్కడి ప్రజల  సంస్కృతి, వేష భాషలు ఇండియా లోని ఈ ఈశాన్య రాష్ట్ర ప్రత్యేకతలు. ఈప్రదేశ పర్యటన ఆనందం  మరియు ఆసక్తి కర అంశం అనటంలో ఎట్టి  సందేహం లేదు. మణిపూర్ భౌగోళికత మణిపూర్ కు ఉత్తరాన నాగాలాండ్, దక్షిణంలో మిజోరం, పడమటి లో అస్సాం , తూర్పు లో బర్మా సరిహద్దులుగా కలవు.  

మణిపూర్ లో చూడవలసిన ఆకర్షణీయ ప్రదేశాలు ఇంఫాల్, - ఇంఫాల్ మణిపూర్ కు రాజధాని. ఎన్నో సుందర ప్రదేశాలు, అడవులు కలిగి వుంది. ఈ ప్రదేశంలో పోలో ఆట పుట్టింది అంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది.  ఈప్రదేశం లో పురాతన చారిత్రక అంశాలు, శిధిలాలు, స్మారకాలు, టెంపుల్స్, వంటివి ఎన్నోకలవు. రెండవప్రపంచ యుద్ధం ఇంఫాల్ యుద్ధం, మరియు కొహిమ యుద్ధంలు గా ఇక్కడే ప్రసిద్ధి చెందాయి. వీటి అన్నిటికి తోడు అనేక పర్యాటక ప్రదేశాలు కూడా కలవు. శ్రీ గోవింద్ జీ టెంపుల్, కంగ్ల పాలస్, వార్ సమాధులు, ఇమా కేఇతేల్ అనే మహిళల బజార్, ఇంఫాల్ వాలీ మరియు కొన్ని గార్డెన్ లు కలవు.  మయన్మార్ కు ప్రవేశ ద్వారంగా చెప్పబడే చందేల్ ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది జిల్లా మరియు టవున్ కూడాను. మణిపూర్ పర్యటనలో ఈ ప్రాంతం తప్పక చూడాలి.

చందేల్ మరియు తమెంగ్ లాంగ్ ప్రదేశాలు వివిధ రకాల వృక్ష సంపద, జంతు సంపదలతో జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతాలు. చందేల్ లోని మోర్ ప్రదేశం మణిపూర్ లోనే ప్రధాన వాణిజ్య కేంద్రం. తమెంగ్ లాంగ్ లో జరిగే ఆరంజ్ ఫెస్టివల్ ఒక ప్రధాన టూరిస్ట్ ఆకర్షణ.  చిన్న చిన్న గ్రామాలు కల సేనాపతి జిల్లా ఒక విశిష్ట టూరిస్ట్ ప్రదేశం. మారం ఖుల్లెన్, మఖేల్, యాంగ్ ఖుల్లెన్ లు ఎంతో చరిత్రను అందిస్తాయి. మణిపూర్ కు మావో ఒక ప్రవేశ ద్వారం. పురూల్ తోటో అనే ఆటకు రాష్ట్రంలో ప్రసిద్ధి.  మణిపూర్ సందర్శన లో సరస్సులు,తోటలు , శిఖరాలు చూడవచ్చు.

ఇక్కడ కల లోక్ తక సరస్సు ప్రపంచం లోనే అతిపెద్ద ఫ్లోటింగ్ లేక్. ఈ సరస్సు బిష్ణుపూర్ లో కలదు.  ఇక్కడ ఎక్కువ భాగం మత్స్యకారులు నివసిస్తారు. లోక్ తక సరస్సు వద్ద కల సేంద్ర ఐలాండ్ మరొక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్.  ఈ సరస్సు సమీపం లోనే కీబుల్ లంజావో నేషనల్ పార్క్ కూడా కలదు.

తామేంగ్ లాంగ్ లోని జీలాద్ సరస్సు ఫోటోగ్రాఫర్ లకు ఒక స్వర్గం గా వుంటుంది. అనేక ప్రకృతి దృశ్యాలతో తౌబాల్ జిల్లా లోని విథౌ సరస్సు కూడా ఒక ఆకర్షణే. మణిపూర్ లో తౌబాల్ జిల్లా వ్యవసాయ జిల్లా. వారి పొలాలు ఇక్కడ అధికం. ఐకోప్ లేక్, లౌసి లేక్,పూమ్లేన్ లేక్ లు తౌబాల్ లో ప్రధానమైనవి. ఖయాంగ్ వాటర్ ఫాల్స్ వద్ద కల కాచు ఫోంగ్ లేక్ చాలా అందమైనది. చూర చందాపూర్ లోని ఖుగా డాం, మరియు నగలోయి ఫాల్స్ కూడా టూరిస్ట్ లు అధికంగా వచ్చే ప్రదేశాలే.  ఉఖ్రుల్ లోని శిరుయి కశాంగ్ పీక్ పూర్తిగా శిరుయి లిల్లీ ల తో కప్పబడి వేసవి లో ఆహ్లాదంగా వుంటుంది.  

ఈ రకమైన వివిధ పర్యాటక ఆకర్షణల తో మణిపూర్ పర్యాటకుడు ఆశించినదానికంటే కూడా అధికమైన ఆనందాలను అందిస్తుంది అనటంలో ఎట్టి  సందేహం లేదు. 

మణిపూర్ ప్రదేశములు

  • ఇంఫాల్ 44
  • తమెంగ్‌లాంగ్ 11
  • తౌబాల్ 13
  • బిష్ణుపూర్ 15
  • చుర చాంద్ పూర్ 6
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 May,Sun
Return On
11 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 May,Sun
Check Out
11 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 May,Sun
Return On
11 May,Mon