మరారికులం బీచ్ అంతగా ప్రాచుర్యంలో లేదు. కనుక దీని పరిసరాలు ఎంతో శుభ్రంగా కూడా ఉంటాయి. బీచ్ అందాలు ఇక్కడ కల అనేక తాటి చెట్ల వరుసలతో మరింత అధికంగా కనపడతాయి. కేరళ కోస్తా తీరంలో నిశ్శబ్ద మరియు అతి శుభ్రమైన బీచ్ లలో ఒకటిగా చెప్పవచ్చు. బీచ్ లో జనాలు అధికంగా ఉండరు. కాలినడకన ప్రశాంతంగా బీచ్ లో తిరిగి ఆనందించవచ్చు.
ఇక్కడి బీచ్ లోని తెల్లని ఇసుక తిన్నెల స్పర్శ మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. నీరెండ, ఒంటరితనం మీకు ఎంతో హాయినిస్తాయి. ఇక్కడి దేవాలయాలు, ఇతర పుణ్య క్షేత్రాలు బీచ్ విలేజ్ అందాలు మరింత పెంచుతున్నాయి. చక్కటి ఎండలో విశ్రాంతిగా రోజంతా ఆనందించవచ్చు. స్ధానికులతో సమావేశాలు చేయవచ్చు. వారి జీవన విధానాలు తెలుసుకోవచ్చు. వివిధ ఆయుర్వేద చికిత్సలు అవసరమనుకుంటే పొందవచ్చు. వివిధ ఆటలు అంటే, వాలీ బాల్, పారా సెయిలింగ్, స్విమ్మింగ్ మరియు ఇతర నీటి క్రీడలు ఆచరించవచ్చు.



Click it and Unblock the Notifications