ఇది ఒక వినాయకుడి మందిరం. సుమారుగా 1900 ల సంవత్సరంనుండి హిందూ భక్తులు, పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. ఒకప్పుడు చిన్న ఇటుకల నిర్మాణంగా ఉండే ఈ దేవాలయం, ఇపుడు ముంబై నగరంలో అత్యంత ధనవంతమైన దేవాలయంగా మారింది. ఎంతోమందిని ఆకర్షిస్తోంది.
మీరు ఇక్కడకు సరైన రోజులలో, సరైన సమయాలలో చేరాలి. లేదంటే, పొడవాటి క్యూలలో నిలబడి గంటల తరబడి మీ సమయం అంతా ఇక్కడ వెళ్ళబుచ్చాల్సిందే. దేవాలయ శిల్పం తీరు మరియు యాత్రికుల నిర్వహణ వంటివి పేర్కొనదగిన అంశాలు. ముంబై లోని ఇతర ప్రధాన పర్యాటక కేంద్రాలు అయిన వర్లి సీ ఫేస్ మరియు హాజీ ఆలీ జ్యూస్ సెంటర్లకు ఈ మందిరం దగ్గరగానే కలదు.



Click it and Unblock the Notifications