అనయిరంకాల్, మున్నార్

అనయిరంకాల్ , పర్యాటక ప్రదేశం మున్నార్ కు 22 కి.మీ. ల దూరంలో కలదు. తేయాకు తోటలకు, డ్యామ్ మరియు సరస్సుకు ప్రసిద్ధి. అనయిరంకాల్ సరస్సు మరియు డ్యామ్ ఇక్కడకు వచ్చి తమ దాహార్తిని తీర్చుకునే ఏనుగుల గుంపుల కారణంగా వందలాది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పొడవైన అటవీ మార్గాలు, విశాలమైన టీ తోటలు కల ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణ టాటా టీ తోటలు. తేయాకుల ఘుమ ఘుమలతో పర్యాటకులు ఈ ప్రాంతంలో చక్కని నడక చేయవచ్చు . అనయిరంకాల్ సమీపంలోనే పోతనమేడు కలదు. ఈ రెండు ప్రదేశాలను ఒకేసారి చూడవచ్చు. పచ్చటి తేయాకు మొక్కలు, మెలికలు తిరిగే సన్నని రోడ్లు, పచ్చటి అడవులు, ఈ ప్రాంతాన్ని ఒక విహార ప్రదేశం చేశాయి. ఇక్కడ అనేక వసతులతో కూడిన రిసార్టులు కలవు. ఈ రిసార్టులలో ఒకటి లేదా రెండు రోజులు ఉంటే చాలు, ఎంతో ఉత్సాహాన్ని మరో మారు పొందవచ్చు.

Please Wait while comments are loading...