అట్టుకాల్, మున్నార్

అట్టుకాల్ ప్రదేశం దాని జలపాతాలకు ప్రసిద్ధి. మున్నారు నుండి ఈ ప్రదేశం 9 కి.మీ. ల దూరంలో మాత్రమే ఉండి, తరచుగా చూసేదిగా ఉంటుంది. ఈ జలపాతాలు మున్నార్ మరియు పల్లివాసల్ మధ్య ఉన్నాయి. కనుక పర్యాటకులు పల్లివాసల్ మరియు అట్టుకాల్ ప్రదేశాలను ఒకే ట్రిప్ లో చూడవచ్చు. అందమైన ఈ ప్రదేశం చుట్టూ పచ్చని కొండలు కలవు. ట్రెక్కర్లు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు. జలపాతాల చుట్టూ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలు కలవు. అట్టుకల్ సందర్శనకు వర్షాకాలం వెళ్ళిన వెంటనే సూచించదగినది. ఆ సమయంలో జలపాతాలనీరు, పచ్చదనం అధికంగా ఉంటాయి. జలపాతాల హోరుమనే శబ్దం మైళ్ళదూరం వినపడుతుంది. పర్యాటకులు ఈ జలపాతాలను చూసి మంత్రముగ్ధులు కావలసిందే. అట్టుకాల్ సందర్శకులకు సమీపంలోనే కల ఛీయపారా జలపాతాలు మరియు వలారా జలపాతాలు కూడా సూచించదగినవే.

Please Wait while comments are loading...