రాజమాల మున్నార్ హిల్ స్టేషన్ కు 15 కి.మీ.ల దూరంలో కలదు. నీలగిరి ధార్ లకు ఇది సహజ నివాసంగా చెపుతారు. నివేదికల మేరకు, ఎరవికులం - రాజమల ప్రాంతం ప్రపంచంలోని థార్ జంతువుల సంఖ్యలో సగం వాటికి ఈ ప్రదేశం నివాసంగా కలదు. రాజమల ఆకర్షణలు ఇంతటితో ముగిసిపోలేదు. ఈ ప్రదేశం ఎంతో అందమైనది. చుట్టూ పర్వత శ్రేణులు. పొడవైన పచ్చని ప్రదేశాలు, పచ్చిక బయళ్ళు, వంటివి రాజమలను పర్యాటకులకు, ట్రెక్కర్లకు ఆకర్షణీయం చేస్తాయి. సముద్ర మట్టానికి సుమారు 2700 మీటర్ల ఎత్తునగల ఈ ప్రదేశం కుటుంబ పర్యటనలకు, పిక్ నిక్ లకు, హనీమూన్ లకు సరైనది. రాక్ క్లైంబింగ్, మౌంటెనీరింగ్ మరియు ట్రెక్కింగ్ వంటివి కూడా సాహస పర్యాటకులకు కలవు.