ట్రెక్కింగ్, మున్నార్

మున్నార్ పర్యాటకులు ఆచరించే క్రీడలలో ట్రెక్కింగ్ రారాజు వంటిది. మున్నారు లో ఎన్నో ట్రెక్కింగ్ ప్రాంతాలు కలవు. అన్నీ సురక్షితమైనవిగానే చెప్పవచ్చు. పర్యాటకులు ఈ ట్రెక్కింగ్ మార్గాలలో హిల్ స్టేషన్ లోని వివిధ ప్రదేశాలకు వెళ్ళవచ్చు. రాజమల, ఎరవికులం నేషనల్ పార్క్, నయమకాడు వంటి ప్రదేశాలు ఉత్తమ ట్రెక్కింగ్ మార్గాలు. ట్రెక్కింగ్ మరియు మౌంటెనీరింగ్ లు పర్యాటకులు ప్రకృతిలో గల అద్భుతాలను దర్శించేలా చేస్తాయి. మున్నార్ ప్రదేశాలు వ్యాలీలు, గుట్టలు, పచ్చిక బయళ్ళు, చిన్న కొండలు వంటి వాటితో సున్నితమైన ట్రెక్కింగ్ కు అనుకూలం. ట్రెక్కింగ్ చేయుటకు మరియు విశ్రాంతి తీసుకొనుటకు రెండిటికి ఈ ప్రదేశాలు పర్యాటకులకు అనువుగా ఉంటాయి. టూరిజం అభివృధ్ధిలో భాగంగా అటవీ శాఖ ఎరవికులం నేషనల్ పార్క్, అనముడి వంటి శిఖరాలపై ట్రెక్కింగ్ నిర్వహిస్తోంది. అనుమతులను తేలికగా ఇస్తోంది. ట్రెక్కింగ్ శిక్షణా శిబిరాలు చుట్టు పక్కల పరిసరాలలో నిర్వహిస్తోంది.

Please Wait while comments are loading...