చాముండి హిల్స్ దిగువకల ఈ భవనం తప్పక చూడాలి. ఈ మహల్ ను రాజు క్రిష్ణరాజ ఒడయార్ IV 1921 లో అప్పటి వైస్ రాయ్ కొరకు పాశ్చాత్య శైలిలో నిర్మించారు. ప్రస్తుతం దీనిని భారత ప్రభుత్వ పర్యాటక శాఖ అయిదు నక్షత్రాల హోటల్ గా చక్కని ఆతిధ్యాలతో నిర్వహిస్తోంది.
ఈ భవనం హోటల్ గా మార్చినప్పటికి పురాతన శైలి కొనసాగుతోంది. అన్ని గదులు చక్కగా నిర్వహించబడుతున్నాయి. డైనింగ్ రూమ్ మరియు సమావేశ గదులు వంటివి ప్రధాన ఆకర్షణ. పురాతన చిత్రాలు, ఫర్నిచర్ వంటివి ఆధునీకరించారు. ఇక్కడి లాన్ లో కాక్ టెయిల్ పార్టీలు జరుగుతాయి. కావలసినంత పార్కింగ్ స్ధలం కలదు.



Click it and Unblock the Notifications