Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నాగాలాండ్

నాగాలాండ్ పర్యటన - మంత్ర ముగ్ధులను చేసే ప్రకృతి  సౌందర్యాలు !

నాగాలాండ్ భారత దేశం యొక్క ఈశాన్య  భాగం లో ఒక చిన్న పర్వత రాష్ట్రం. ఇక్కడి ప్రజలు స్వతహాగా నెమ్మది స్వభావులు. వీరిలో చాలామంది వ్యవసాయదారులు. ఈ భూమి ఎంతో అందమైన ప్రదేశాలను , ఆసక్తికర చారిత్రక అంశాలను, అరుదైన వృక్ష మరియు జంతు సంపదను అన్నిటికి మించి స్థానిక ప్రజల అద్భుత సంస్కృతి ని కలిగి వుంది. ఇట్టి వివిధ అంశాలతో ఇండియా లోని నాగాలాండ్ మీ పర్యటన కు ఎదురు తెన్నులు చూస్తూ వుంటుంది.  

నాగాలాండ్ ఇండియా లోని అత్యంత చిన్న రాష్ట్రాలలో ఒకటైన నాగాలాండ్ ఈ విశ్వం  లో ప్రకృతి ప్రేమికులకు ఎల్లప్పుడూ ఒక అద్భుతం గా నే కనపడుతూ వుంటుంది. పూర్తిగా సంస్కృతి వారసత్వ సంప్రదాయాల తో నిండిన ఈ చిన్న ప్రదేశం పర్యాటక రంగం లో తరచుగా 'స్విట్జర్లాండ్ అఫ్ ఈస్ట్' గా పెర్కొనబడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నాగాలాండ్ పర్యటన ప్రకృతి పర్యటన గా పేర్కొనాలి. సహజ ప్రకృతి మరియు నిరంతరం శోభిల్లే నాగాలాండ్ !నాగాలాండ్ టూరిజం గురించి మీరు తెలుసు కోవాలంటే, నాగాల ఈ భూమి అంతా ఎన్నో సుందర దృశ్యాలు, పచ్చటి ప్రదేశాలు, అందమైన సూర్యోదయ సూర్యాస్తమయాలు కలదిగా మీరు గుర్తించవచ్చు. పూర్తి నాగాలాండ్ పర్యటన తర్వాత మీరు అరుదైన మీ జ్ఞాపకాలను మీతో ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. కనుక మీరు ప్రకృతి పర్యటన పట్ల ఆసక్తి కల వారైతే,  అందమైన నాగాలాండ్ పర్యటనకు మించినది వేరు ఏమీ లేదని భావించండి.  

నాగాలాండ్ భౌగోళికత  

నాగాలాండ్ లో చాలా ప్రదేశాలు పర్వత ప్రాంతాలు. నాగాలాండ్ చుట్టూ పడమటి లో అస్సాం, మణిపూర్   దక్షిణం లోను, ఉత్తరం లో అరుణాచల్ ప్రదేశ్ లు కలవు. అందమైన ఈ రాష్ట్రానికి ఏడు పాలన జిల్లాలు కలవు.  వీటిలో సుమారు 16 ప్రధాన తెగలు కలవు. ఇక పచ్చటి ఈ రాష్ట్రం లో వాతావరణం గురించి చెప్పనలవి కాదు.  ఇక్కడి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగానే వుండటం తో పర్యాటకులు ఎపుడైనా సరే నాగాలాండ్ పర్యాటన ప్రణాళిక చేయవచ్చు. 

 ఆహారం, ప్రజలు వారి సంస్కృతి  

నాగాలాండ్ ప్రజల ఆహారం ప్రధానంగా చేపలు, మాంసం. వీటిని వండి వివిధ  రూపాలలో వివిధ తెగల ప్రజలు తింటారు. ఉడికించిన కూరల వంటకాలు, మాంసం వంటకాలు , వరి అన్నం వీరు తింటారు. వీరి ఆహారాలు చాలా వరకు,  కాల్చినవిగాను పులుపు పెట్టబడినవి గాను వుంటాయి. నాగాలాండ్ ప్రజలు ఆ రాష్ట్ర ఆభారనాలు. అందరూ, సాంప్రదాయ దుస్తులు, వేష భాషలు కలిగి, పూసలు, నగల,ఆభారనాలు ధరించి వుంటారు. వారిని చూస్తె చాలు ఆనందం కలుగు తుంది. ఈ స్థానికులు వారి ప్రేమపూర్వక అతిధ్యాలతో మీకు నాగాలాండ్ పర్యటన  మరచి పోలేనిది గా చేస్తారు. 

చివరగా చెప్పాలంటే, వారి కల్చర్ గురించి చెపుతూ పోతే అది అనంతంగా వుంటుంది. నృత్యాలు, పాటలు, వారి దైనందిన జీవనంలో ఒక భాగం. నాగాలకు, జీవితం అంటే, ఒక పండగ గా భావిస్తారు.  నాగాలాండ్ లోని ప్రదేశాలు నాగాలాండ్ లోని అద్భుత పర్యాటక ప్రదేశాలు ...కొహిమ, దిమాపూర్, మొన, వోఖ,ఫేక్, పీరెన్ వంటివి ఎన్నో కలవు. పర్యాటకులకు కల ఈ అద్భుత ప్రదేశాలను చూసి ఆనందిన్చేకు మీరు తప్పక అతి త్వరలో ఒక ప్రణాళిక బద్ధమైన పర్యటన ఖరారు చేసుకొనండి. 

నాగాలాండ్ ప్రదేశములు

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed